ఆ న‌లుగురిలో నేను లేను .. థియేట‌ర్ల బంద్ వ్య‌వ‌హారంలో స్పందించిన అల్లు అర‌వింద్

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుండి థియేట‌ర్లు మూసివేయ‌నున్న‌ట్లు సినీ ఎగ్జిబిట‌ర్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. టాలీవుడ్‌లో చోటుచేసుకున్న ప‌రిణామాల‌పై ప్ర‌ముఖ నిర్మాత అర‌వింద్ స్పందించారు. ఆదివారం విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. ఆ నలుగురు అనే మాట 15 ఏళ్ల క్రితం ప్రారంభ‌మైంది. ఆ న‌లుగురికి నాకు సంబంధం లేదు. వారి నుండి నేను కొవిడ్ స‌మ‌యంలోనే బ‌య‌ట‌కు వ‌చ్చేశానన్నారు. ప్ర‌స్తుతం ఆ న‌లుగురు 10 మంది అయ్యారన్నారు.

నాకు తెలుగు రాష్ట్రాల్లో 15 థియేట‌ర్లు లోపే ఉన్నాయి. తెలంగాణ‌లో ఒక‌టే ఉంది. లీజు పూర్త‌య్యాక వాటిని రెన్యువ‌ల్ చేయెద్ద‌ని స్టాఫ్‌కి చెబుతుంటార‌ని.. అవి త్వ‌ర‌లో ఉండ‌వ‌న్నారు. సినిమాలు నిర్మించ‌డ‌మే 50 ఏళ్లుగా త‌న వృత్తి అని అర‌వింద్ అన్నారు.

జూన్ 1వ తేదీ నుండి థియేట‌ర్ల మూసేస్తామ‌నే ఎగ్జిబిట‌ర్ల నిర్ణ‌యంపై ఎపి సినిమాటోగ్ర‌ఫి మంత్రి కందుల దుర్గేశ్ స్పంద‌న స‌మంజ‌స‌మైన‌దేన‌ని.. తాజా ప‌రిణామాల‌పై జ‌రిగిన ఏ స‌మావేశానికీ తాను వెళ్ల‌లేద‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా విడుద‌ల కాబోతున్న సంద‌ర్భంగా థియేట‌ర్లు మూసేస్తామ‌ని అన‌డం దుస్సాహ‌స‌మేన‌ని.. మ‌న ఇండ‌స్ట్రీ నుండి వెళ్లి పోరాడుతున్ వ్య‌క్తి ఆయ‌న‌. డిప్యూటి సిఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ , సిఎం చంద్ర‌బాబు మ‌న‌కు తెలిసిన వారే క‌దా క‌లుద్దాం అన్నారు. కానీ, ఛాంబ‌ర్ వాళ్లు ఎవ‌రూ వెళ్ల‌లేదు. ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక క‌లిసి వెళ్లాలి క‌దా.. ఎవ‌రూ వెళ్ల‌లేద‌ని ఆయ‌న తెలిపారు.

తెలుగు సినిమారంగంలో ఉన్న వారికి ఎపి ప్ర‌భుత్వంపై క‌నీస మ‌ర్యాద‌. కృత‌జ్ఞ‌త క‌నిపింద‌డం లేద‌ని.. ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాద‌వుతున్నా.. సిఎంని కనీసం మ‌ర్యాద‌పూర్వ‌కంగా వారు క‌ల‌వలేద‌ని.. కేవ‌లం చిత్రాల విడుద‌ల సంద‌ర్భంగా ప్ర‌భుత్వం ముందుకు రావ‌డం మిన‌హా చిత్ర‌రంగ అభివృద్ధి కోసం సంఘ‌టితంగా వ‌చ్చింది లేద‌ని శ‌నివారం డిప్యూటి సిఎం కార్యాల‌యం పేర్కొంది. సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ధికి అంద‌రూ క‌లిసి రావాల‌ని డిప్యూటి సిఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సూచించినా ఎవ‌రూ సానుకూలంగా స్పందించ‌లేద‌ని.. గ‌త ప్ర‌భుత్వం ఎలా ఇబ్బందుల‌కు గురి చేసిందే అంద‌రూ మ‌ర్చిపోయారు. నిర్మాత‌లంతా క‌లిసిన‌పుడు అంద‌రూసంఘ‌టితంగా ఉంటే ప‌రిశ్ర‌మను అభివృద్ధి చేయ‌వ‌చ్చ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పార‌ని.. అయినా ఎవ‌రికి వారే వ్య‌క్తిగ‌తంగా టికెట్ ధ‌ర‌ల పెంచాలంటూ అర్జీలు ఇస్తున్నార‌ని.. దానికి ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందిస్తోంద‌ని తెలిపింది.

 

Leave A Reply

Your email address will not be published.