కుండపోతతో ముంబయి అతలాకుతలం

ముంబయి (CLiC2NEWS): భారీ వర్షాలు ముంబయి నగరాన్ని అతలాకుతలం చేశాయి. దేశ ఆర్థిక రాజధాని వీధుల్లో భారీగా వరద నీరు చేరింది. ఆదివారం అర్థరాత్రి నుంచి కుండపోత వానతో నగర జీవనం పూర్తిగా స్తంభించి పోయింది. భారీ వరదల మూలంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ పూర్తిగాస్తంభించి పోయింది. రైళ్లు, మెట్రో సేవలు కూడా నిలిచిపోయాయి. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాజయం ఏర్పడింది. అధికారులు ముంబయి, ఠానే, రాయ్‌గఢ్ లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముంబయిలోని దాదర్ టీటీ ఈస్ట్, పరేట్ టీటీ, కలచౌకి, వాడాలా, హింద్ మాతా, చర్చిగేట్, దాదర్‌లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.