సరస్వతి పుష్కరాలు: చివరి రోజు పోటెత్తిన భక్తులు

కాళేశ్వరం (CLiC2NEWS): కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు నదిలో పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. భక్తులు పుష్కర స్నానాలు ఆచరించిన అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముగింపు వేడుకల కోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. సరస్వతి నది పుష్కరాలు మే 15వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే.