స్వీయ నిర్బంధంలోకి బీజేపీ ఎంపి

న్యూఢిల్లీ: రోజురోజుకీ దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ మ‌హ‌మ్మారి బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య కూడా రెట్టింపు అవుతోంది. తాజాగా మాజీ క్రికెట‌ర్, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ గౌతం గంభీర్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. గంభీర్ నివాసంలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో.. స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్న‌ట్లు ఆయ‌న ట్వీట్ వేదికగా వెల్లడించారు. కొవిడ్ టెస్టుల‌కు గంభీర్ త‌న న‌మూనాల‌ను పంపించాడు. ప్ర‌తి ఒక్క‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని, ఎవ‌రూ కూడా తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌ని గంభీర్ విజ్ఞ‌ప్తి చేశారు. అలాగే తన కుటుంబసభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీలో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అక్క‌డ క‌రోనా సెకండ్ వేవ్ మొద‌లైంది. ప్ర‌తి రోజు 6 వేల‌కు త‌గ్గ‌కుండా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి.

 

Leave A Reply

Your email address will not be published.