తెలంగాణలో 1,607 కొత్త కేసులు.. 6 మరణాలు

హైద‌రాబాద్‌: తెలంగాణలో నిన్న రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు 44,644 పరీక్షలు నిర్వహించగా కొత్త‌గా 1,607 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,48,891 కు చేరింది. ఈ మేర‌కు వైద్య ఆరోగ్యశాఖ శ‌నివారం ఉద‌యం బులిటెన్ విడుద‌ల చేసింది. 24 గంటల్లో ఆరుగురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,372కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 937 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,27,583 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 19,936 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 44,644 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 45,75,797 కు చేరింది.

జిల్లాల వారీగా….
గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 296, ఆదిలాబాద్ 14, భద్రాద్రి కొత్తగూడెం 124, జగిత్యాల్‌ 42, జనగాం 29, జయశంకర్ భూపాలపల్లి 21, జోగులమ్మ గద్వాల్‌ 9, కామారెడ్డి 30, కరీంనగర్‌ 78, ఖమ్మం 84, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 14, మహబూబ్‌ నగర్‌ 23, మహబూబాబాద్‌ 28, మంచిర్యాల్‌ 30, మెదక్‌ 19, మేడ్చల్ మల్కాజ్‌గిరి 113, ములుగు 37, నాగర్‌ కర్నూల్‌ 43, నల్గొండ 67, నారాయణ్‌పేట్‌ 0, నిర్మల్‌ 16, నిజామాబాద్‌ 23, పెద్దంపల్లి 26, రాజన్న సిరిసిల్ల 30, రంగారెడ్డి 115, సంగారెడ్డి 41, సిద్ధిపేట్‌ 69, సూర్యాపేట 46, వికారాబాద్‌ 16, వనపర్తి 22, వరంగల్‌ రూరల్‌ 25, వరంగల్‌ అర్బన్‌ 48, యాద్రాది భువనగిరి 29 కేసులు నమోదయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.