తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌!

వాషింగ్టన్‌ : మితవాద రాజకీయాలను తిరస్కరిస్తూ అమెరికన్లు చారిత్రాత్మక తీర్పునివ్వడంతో అమెరికా అధ్యక్ష పీఠం జో బిడెన్‌ను వరించింది. దీంతో అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ ఎన్నికయ్యారు. బిడెన్‌ 284 ఎలక్టోరల్‌ ఓట్లతో ఘన విజయం సాధించగా.. పబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ 214 ఎలక్టోరల్‌ ఓట్ల దగ్గరే ఆగిపోయారు. డెమొక్రటిక్‌ పార్టీ తరుఫున ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసిన భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్‌ అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. అమెరికాలో ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి నల్లజాతి వనితగా ఆమె రికార్డుకెక్కారు. 20 ఎలక్టొరల్‌ ఓట్లు వున్న పెద్ద రాష్ట్రం పెన్సిల్వేనియాను డెమొక్రాట్లు గెలుచుకోవడంతో బిడెన్‌ విజయం ఖాయమైంది. తనకు మరపురాని విజయాన్ని అందించిన అమెరికన్‌ ఓటర్లకు బిడెన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఓటింగ్‌ సమయంలోను, ఓట్ల లెక్కింపులోను అనేక అడ్డంకులు సృష్టించి, కోర్టుకెక్కి అల్లరి చేసి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూసిన మితవాద ట్రంప్‌నకు గట్టి షాకే తగిలింది.

ఇది మహిళా లోకం విజయం : కమలా హారిస్‌

ఈ గెలుపు గెలుపు మహిళా లోకం సాధించిన విజయంగా అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయిన కమలా హారిస్‌ అభివర్ణించారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత బైడెన్‌ తన సొంత రాష్ట్రమైన డెలావర్‌లోని విల్లింగ్టన్‌లో డెమొక్రాట్లు తొలి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కమలా హారిస్‌ మాట్లాడుతూ.. ‘ అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికయిన తొలి మహిళను కావొచ్చు. కానీ, చివరి మహిళను కాదు ‘ అంటూ.. ఉద్వేగంగా ప్రసంగించారు. అధ్యక్ష పదవికి ఎన్నికయిన బైడెన్‌ నిరంతరం అమెరికన్ల క్షేమం కోసమే ఆలోచిస్తారని అన్నారు. తల్లి శ్యామలా గోపాలన్‌ అమెరికాకు వచ్చి కన్న కలలను గుర్తు చేసుకున్నారు. మెరుగైన భవిష్యత్తును నిర్మించే శక్తి ప్రజల్లో ఉందని, అమెరికా చరిత్రలో కొత్త రోజులు ఉండబోతున్నాయని నిర్ణయించారని` ఆమె హర్షాన్ని వ్యక్తపరిచారు.

Leave A Reply

Your email address will not be published.