కోర్టులు తెరిచేందుకు హైకోర్టు అనుమతి

హైదరాబాద్: తెలంగాణలోని అన్ని కోర్టులు తెరిచేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 31 వరకు కోర్టులు అనుసరించాల్సిన అన్లాక్ విధానాన్ని ఉన్నతన్యాయస్థానం వెల్లడించింది. రాజధాని మినహా ఇప్పటికే జిల్లాల్లో భౌతికంగా కేసుల విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ జిల్లాలోని సివిల్, క్రిమినల్ కోర్టులూ తెరవాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టులో డిసెంబర్ 31 వరకు ప్రస్తుత ఆన్లైన్, భౌతిక విచారణ విధానమే కొనసాగించనున్నారు. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ వేగంగా జరపాలని ప్రత్యేక కోర్టులకు హైకోర్టు సూచించింది. హైకోర్టు విధించిన గడువుకు కట్టుబడి విచారణ జరపాలని రిజిస్ట్రార్ జనరల్ ఉత్వర్వులను జారీ చేసింది.