పెద్దపులి దాడిలో ఆసిఫాబాద్ యువకుడు మృతి

దహేగాం: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాం మండలంలోని దిగెడ గ్రామంలో పెద్ద పులి పశుల కాపరిపై దాడి చేసింది. దిగెడ గ్రామ సమీపంలో పశువులను మేపుతున్న గణేశ్(22)పై పెద్దపులి దాడిచేసి అటవీలోకి లాక్కెళ్లింది. గణేశ్‌తో పాటు ఉన్న మరో పశువకాపరి యువకుడు గ్రామంలోకి పరుగెత్తుకొచ్చే చెప్పాడు. దీంతో గ్రామస్తులంతా కలిసి అడవి వైపు వెళ్లారు. గ్రామస్తుల అరుపులకు భయపడిన పెద్ద పులి గణేశ్‌ను వదిలేసి వెళ్లిపోయింది. పెద్దపులి దాడిలో గణేశ్ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గణేశ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.