బైడెన్‌కు మోడీ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: అమెరికా దేశాధ్య‌క్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌తో ప్ర‌ధాని నరేంద్ర మోడీ ఫోన్‌లో మాట్లాడారు. అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బైడెన్‌కు ఆయ‌న కంగ్రాట్స్ తెలిపారు. అమెరికాతో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యానికి క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు బైడెన్‌తో మోదీ తెలిపారు. అమెరికా ఉపాధ్య‌క్షురాలిగా ఎన్నికైన క‌మ‌లా హారిస్‌కు కూడా మోదీ కంగ్రాట్స్ చెప్పారు. క‌మ‌లా గెలుపు భార‌తీయ‌, అమెరికా ప్ర‌జ‌ల‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని మోడీ అన్నారు. బైడెన్‌తో జ‌రిగిన ఫోన్ సంభాష‌ణ‌లో .. కోవిడ్ మ‌హ‌మ్మారి, వాతావ‌ర‌ణ మార్పులు, ఇండోప‌సిఫిక్ ప్రాంత స‌హ‌కారం లాంటి అంశాల‌ను కూడా చ‌ర్చించిన‌ట్లు మోడీ త‌న ట్వీట్‌లో తెలిపారు.

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతి మహిళ కమల హ్యారిస్‌లకు మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరి నేతృత్వంలో భారత్, అమెరికా సంబంధాలు మరింత పురోగమిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారం కొనసాగుతుం దని ఇరువురు నేతలు స్పష్టం చేశారు. ‘అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపాను. కోవిడ్, వాతావరణ మార్పు సహా ఇరుదేశాలు ఎదుర్కొంటున్న పలు సవాళ్లపై చర్చించాను’ అని మోడీ మంగళవారం ట్వీట్‌ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం తర్వాత ప్రధాని ఇరువురు నేతలకు శుభాకాంక్షలు తెలపడం గమనార్హం.

 

Leave A Reply

Your email address will not be published.