స్వీయ నిర్బంధంలోకి సల్మాన్ ఖాన్

ముంబ‌యి: దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు ఈ మహమ్మారి తీవ్రత ఎక్కువ అవుతోంది. ఇప్పటికే ఈ వైరస్‌ భారీన పడ్డారు. తాజాగా బాలీవుడ్‌ హీరో, కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ క్వారంటైన్‌ కు వెళ్లాడు. తన కారు డ్రైవర్‌తో పాటు ఇద్దరు వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకడంతో సల్మాన్‌ ఖాన్‌ క్వారంటైన్‌ లోకి వెళ్లారు. ఇటీవల తన వ్యక్తిగత సిబ్బందికి సల్మాన్‌ కరోనా పరీక్షలు చేయించారు. దీంతో వారికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. తన వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్త చర్యగా తాను హెం క్వారంటైన్‌లో ఉన్నట్లు సల్మాన్‌ పేర్కొన్నారు.
దీంతో తన తండ్రి సలీంఖాన్‌ వివాహ వార్షికోత్సవ వేడుకలను రద్దు చేశారు. లాక్‌ డౌన్‌ సమయంలో సల్మాన్‌ తన కుటుంబ సభ్యులతో పామ్‌ హౌస్‌లో ఉండి వ్యవసాయం చేశారు. అక్కడి నుంచే ఆయన కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ కండల వీరుడు తన అభిమానులకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.