హైదరాబాద్ మొదటి మహిళా మేయరు: రాణి కుముదిని దేవి

హైదరాబాద్‌కు ఎందరో మేయర్‌లు పదవి బాధ్యతలు చేపట్టారు. తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నువ్వానేనా అన్నట్లు ఆయా పార్టీలు సన్నద్దం అవుతున్నాయి. నగరంలో మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగడంతో   నామినేషన్ల పర్వం కొనగుతోంది. అయితే ఈ సారి మేయర్‌ పదవిని మహిళకు కేటాయించారు.

ఇక హైదరాబాద్‌ తొలి మహిళ మేయర్‌ రాణి కుముదిని దేవి. ఈమె వరంగల్ జిల్లాలోని వడ్డెపల్లి లో జనవరి 23, 1911 నాడు జన్మించారు.రాణి కుముదిని దేవి తండ్రి గారు పింగళి వెంకటరామారెడ్డి గారు నైజాం రాష్ట్రానికి ఉప ప్రధానమంత్రిగా పని చేశారు.హైదరాబాద్ సంస్తానం భారత యూనియన్లో విలీనమైన తరువాత వెంకటరామారెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కుముదిని దేవి గారు వనపర్తి సంస్తానానికి చెందిన జనుంపల్లి రాజారాందేవ్ రావు గారిని వివాహం చేసుకున్నారు.

రామ్‌దేవ్ రావు హాస్పిటల్ స్థాపన
ఇప్పుడు హెచ్‌ఐవీ పేషెంట్‌లకు కూడా పునరావాసం కల్పిస్తున్నారు. పేషెంట్‌లకు కొవ్వొత్తుల తయారీ, బ్యాండేజ్‌ క్లాత్‌ తయారీ, వడ్రంగి పని, తాపీ పనుల్లో శిక్షణ ఇప్పించి వారి ఉపాధికి బాటలు వేశారు. సాధారణ పేషంట్‌లకు కూడా వైద్య సదుపాయం కల్పించమని సూచించారు ఆమె భర్త రాజా రాందేవ్‌రావు. దీంతో ఆ పునరావాస కేంద్రం పక్కనే భర్త పేరుపై ‘రామ్‌దేవ్‌రావ్‌’ హాస్పిటల్‌‌ను కుముదినీ దేవి స్థాపించారు. ఇది పూర్తిగా ఛారిటీ హాస్పిటల్‌. చాలా తక్కువగా నామమాత్రపు ఫీజుతో ఇక్కడ సకల వైద్యసౌకర్యాలను అందిస్తున్నారు. వారి వారసుల్లో రెండో కొడుకు విక్రమ్‌దేవ్‌రావ్, పెద్ద కోడలు మీరారావు ప్రస్తుతం దీన్ని పర్యవేక్షిస్తున్నారు.

కుముదిని దేవి గారు నిజాం రాష్ట్రంలో వాహనం నడిపిన మొదటి మహిళగా మరియు హైదరాబాద్ తొలి మహిళా మేయర్ గా (1962 లో) ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు స్రుష్టించారు.కుముదిని దేవి గారు 1962 నుంచి 1972 వరకు వనపర్తి శాసనసభ స్తానానికి ప్రాతినిద్యం వహించారు.కుముదిని దేవి గారు కుష్టు వ్యాది రోగుల కోసం శివానంద పునరావాస కేంద్రం అనే స్వచ్చంద సంస్థను యేర్పాటు చేసి ఎంతో మంది రోగులను ఆదుకున్నారు.కుముదిని దేవి గారు ఆగస్టు 6, 2009 నాడు 98వ యేట కన్నుమూశారు.

-పుల్ల‌మ‌ల్ల విక్రాంత్‌

Leave A Reply

Your email address will not be published.