గ్రేటర్ ఫైట్: టిఆర్ ఎస్ మూడో జాబితా విడుదల

హైదరాబాద్ : తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు టిఆర్ ఎస్ తుది జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే రెండు విడతలుగా 125 మంది అభ్యర్థులను ప్రకటించిన టిఆర్ ఎస్ మూడో జాబితాలో 25 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో టిఆర్ ఎస్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు.