బీజేపీ గూటికి విజయశాంతి..?

హైదరాబాద్: టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. పార్టీ తీరుపై ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్న ఆమె పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్టు తెలిసింది. త్వరలోనే విజయశాంతి బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆమె గ్రేటర్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత కొంతకాలంగా విజయశాంతి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.