ఓ సోద‌రుడిని కోల్పోయాను: సోనియా గాంధీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ దిగ్గజ నేత, రాజ్యసభ్యులు అహ్మద్‌ పటేల్‌ కరోనాకు చికిత్స పొందుతూ మేదాంత ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీతో పాటు పార్టీ శ్రేణులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులు సంతాపాలు తెలిపారు.

`కాంగ్రెస్‌ పార్టీ కోసం తన జీవితాన్నే అంకితం చేసిన సహచరుడుని కోల్పోయాలి. అహ్మద్‌ గొప్ప ప్రజ్ఞాశాలి. విధుల పట్ల ఆయన నిబద్ధత, బాధ్యత, విశ్వసనీయత ఆయన్ని ప్రత్యేక వ్యక్తిగా తీర్చిదిద్దాయి. ఇతరులకు సహాయపడటము, దయా హృదయము ఆయన నుండి ఇతరులు నేర్చుకోవలసినవి. ఆయన లేని లోటును పూడ్చలేము. విశ్వాసమైన సహచరుడు, స్నేహితుడు. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆయ‌న కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి` అంటూ సోనియా గాంధీ ట్వీట్‌ చేశారు.

నేనొక‌ గొప్ప స్నేహితుడిని కోల్పోయా: మ‌న్మోహ‌న్‌సింగ్‌

‌కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు అహ్మ‌ద్ ప‌టేల్ మృతిప‌ట్ల‌ మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్ తీవ్ర సంతాపం వ్య‌క్తంచేశారు. అహ్మ‌ద్‌ప‌టేల్ త‌న‌కు గొప్ప స్నేహితుడ‌ని, ఆయ‌న అకాల మ‌ర‌ణ‌వార్త తెలిసి తాను తీవ్ర‌ దిగ్భ్రాంతికి గురయ్యాన‌ని మ‌న్మోహ‌న్ సింగ్ తెలిపారు. ఈ మేర‌కు ఆయన మీడియాకు ఒక సంతాప సందేశాన్ని విడుద‌ల చేశారు. ఆయ‌న మ‌ర‌ణంతో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని మ‌న్మోహ‌న్ త‌న సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆహ్మ‌ద్‌ప‌టేల్‌ను కోల్పోయిన అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. ‌

“అహ్మద్‌ పటేల్‌ కాంగ్రెస్‌కు పిల్లర్‌ లాంటి వారు. కాంగ్రెస్సే శ్వాసగా, ధ్యాసగా బతికారు. క్లిష్ట సమయాల్లో కూడా కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. ఆయన పార్టీకి ఎనలేని ఆస్తి. ఆయనను కోల్పోయాము అంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ“

రాహుల్ గాంధీ

ప్రియాంక గాంధీ సైతం ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వీరితో పాటు కాంగ్రెస్‌ నేతలు చిదంబరం, కపిల్‌ సిబాల్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోట్‌, కాంగ్రెస్‌ ఎంపి శశిథరూర్‌ పలువురు ఆయన మృతికి సంతాపాలు తెలియజేశారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ ఇకలేరు.

అహ్మద్‌ పటేల్‌ మృతిపట్ల సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

1 Comment
  1. Mallesh Yengani says

    అయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్న…
    🙏🙏🙏😭😭😭😭

Leave A Reply

Your email address will not be published.