జమ్మూ కశ్మీర్‌ నుంచి పారా మిలిటరీ బలగాల ఉపసంహరణ

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో మోహ‌రించిన కేంద్ర పారామిల‌ట‌రీ బ‌ల‌గాల‌ను తక్ష‌ణ‌మే ఉప‌సంహ‌రించుకోవాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు కేంద్రం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ మోహరించిన 10 వేల పారా మిలిటరీ బలగాలను తక్షణమే వెనక్కి రప్పించాలని నిర్ణయించింది. గ‌త ఏడాది ఆగ‌స్టు 5న జమ్మూ కశ్మీర్‌కు స్వ‌యంప‌ర‌తిప‌త్తి క‌ల్పించే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు నేప‌థ్యంలో అక్క‌డ ఎలాంటి హింసాత్మ‌క ఘ‌ట‌న‌లూ చెల‌రేగ‌కుండా భారీ సంఖ్య‌లో పారా మిల‌ట‌రీ బ‌ల‌గాలు మోహ‌రించిన విష‌యం తెలిసిందే.
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో సాయుధ బలగాల మోహరింపు అంశంపై హోం మంత్రిత్వ శాఖ సమీక్ష నిర్వహించిన అనంతరం కేంద్రం ఈ మేరకు ఉత్వర్వులు జారీ చేసింది.‘‘జమ్మూ కశ్మీర్‌లో మెహరించిన 100 కంపెనీల బలగాలు తక్షణమే ఉపసంహరించుకునేందుకు నిర్ణయం తీసుకోబడింది. సదరు సిబ్బంది తమకు కేటాయించిన ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది’’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది.
జమ్మూ కశ్మీర్‌ను మూడు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభ‌జించిన త‌ర్వాత ఐఎఎస్ అధికారి గిరీష్ చంద్ర ముర్మును లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మించింది. ఈ ఏడాది కాలంలో ఉగ్ర‌వాదుల ఏరివేత‌ను సైన్యం ముమ్మ‌రం చేయ‌డంతో వ్యాలీలో ఉద్రిక్త‌త‌లు స‌ద్దు మ‌ణిగాయి. దాంతోపాటు నిర్బంధంలో ఉన్న ప‌లువురు నేత‌ల‌ను కూడా కేంద్రం విడిచిపెట్టంది. ఈ నేప‌థ్యంలో క‌శ్మీర్ లోయ‌లో తిరిగి సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొల్పాల‌నికేంద్రం నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

ల‌ల‌ల‌ల‌

Leave A Reply

Your email address will not be published.