ముగిసిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యింది. పోలింగ్ కేంద్రాలకు 6 గంటలు తరువాత వచ్చే వారికి అనుమతిని నిరాకరించారు. ఆరు గంటల లోపు పోలింగ్ కేంద్రంలో ఉంటే వారికి ఓటు హక్కు వినియో గించుకొనేందుకు అవకాశం ఇచ్చారు. పాతబస్తీ లో కొంత అక్కడక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. మందకొడిగా పోలింగ్ శాతం సాగింది. ఉదయం నుండి పోలింగ్ కేంద్రాలు వెలవెల బోయాయి. గుర్తులు తారుమారుతో ఓల్డ్ మలక్‌పేట్‌లో పోలింగ్ రద్దు అయ్యింది. ఎల్లుండి రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. 4న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు కేవలం 35.80 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. ఆర్సీపురం, పటాన్‌చెరు, అంబర్‌పేట్‌లో అత్యధిక ఓటింగ్‌ శాతం నమోదు కాగా, మలక్‌పేట్‌, కార్వాన్‌లో అత్యల్పంగా ఓటింగ్‌ శాతం నమోదయ్యింది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్‌ జరిగింది. ఎగ్జిట్‌పోల్స్‌పై ఈసీ నిషేధం విధించింది. ఓల్డ్‌ మలక్‌పేట్‌ డివిజన్‌లో పోలింగ్‌ రద్దు కావడంతో ఆంక్షలు కొనసాగనున్నాయి.

ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్‌ మధ్యాహ్నం తర్వాత కాస్త పుంజుకున్నది. 149 డివిజన్లలో కొన్ని స్థానాల్లో మాత్రమే పోలింగ్‌ 50 శాతం దాటింది. కొన్ని చోట్ల కనీసం పోలింగ్‌ 15 శాతం కూడా చేరకపోవడం గమనార్హం.

కరోనా భయం, వరుసగా సెలవులు రావడం, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తుండటంతో నగరవాసులు ఓటు వేయడానికి రాలేకపోయారని అంచనా వేస్తున్నారు. ఈ సారి యువతకు పోటీగా వృద్ధులు, వికలాంగులు ఓటు వేయడానికి కేంద్రాలకు తరలివచ్చారు. పలు చోట్ల ప్రధాన పార్టీల కార్యకర్తలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.