కేజీఎఫ్‌ కాంబినేషన్‌లో ప్రభాస్‌ ‘సలార్‌’

హీరో ప్రభాస్‌, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు పేరు ఖరారు అయింది. ఈ సినిమాకు ‘సలార్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేస్తూ ఫ‌స్ట్ లుక్‌ను కూడా చిత్ర యూనిట్‌ బుధవారం అధికారికంగా వెల్లడించింది. ప్ర‌భాస్ మెషిన్ గ‌న్ ప‌ట్టుకుని కూర్చుని ఉన్న ఫొటో లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ‘ది మోస్ట్ వ‌యొలెంట్ మనుషుల్లో ఒక వ‌యొలెన్స్ చేసే వ్య‌క్తిని స‌లార్’ అని పిలుస్తార‌న్న‌ట్లు వివ‌ర‌ణ కూడా ఇచ్చారు. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ మూవీ అని పోస్ట‌ర్ చూడ‌గానే అర్థ‌మ‌వుతుంది. సినిమా షూటింగ్‌ను వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో స్టార్ట్ చేసి రాధేశ్యామ్ త‌ర్వాత రిలీజ్ చేసేలా ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.