గ్రేటర్ ఫలితాలు.. దూసుకెళ్తోన్న కారు..

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు.. మొదట బ్యాలెట్ల ఎక్కింపులో వెనుకబడిన టీఆర్ఎస్.. ఆ తర్వత ఓట్ల ఎక్కింపు చేపట్టిన తర్వాత దూసుకెళ్తోంది.. మొత్తం 150 డివిజన్లకు గానూ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ 70 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.. బీజేపీ 30 స్థానాల్లో లీడ్‌లో ఉండగా.. ఎంఐఎం 45 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.. ఇక, కాంగ్రెస్ 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.. మధ్యాహ్యానికి ఏడు డివిజన్ల ఫలితాలు వెలువడగా..
`గ్రేటర్` కౌంటింగ్.. మినిట్ టూ మినిట్
మెట్టుగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి సునీత, యూసుఫ్‌గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ పటేల్, రామచంద్రపురంలో పుష్ప నాగేష్ గెలుపొందగా, డబీర్‌పురా, మెహిదీపట్నం, అహ్మద్‌నగర్, రియాసత్ నగర్ డివిజన్లలో ఎంఐఎం, ఏఎస్ రావు నగర్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక, 26 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తున్నా.. బీజేపీ గ్రేటర్లో కేవలం ఒకే చోట భోణీ కొట్టింది.