మరికొన్ని వారాల్లో టీకా: ప‌్ర‌ధాని మోడీ

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ మరికొద్ది వారాల్లోనే సిద్ధమవుతుందని ప్రధాని మోడీ తెలిపారు. శాస్త్రవేత్తల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాగానే వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, మున్సిపల్‌ సిబ్బందితోపాటు తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యమిస్తామన్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై చర్చించేందుకు శుక్రవారం వర్చువల్‌గా ఏర్పాటుచేసిన అఖిలపక్ష భేటీలో మోడీ మాట్లాడారు. ‘కరోనా వ్యాక్సిన్‌ ధర గురించి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రజారోగ్యానికే ప్రాధాన్యత ఇస్తాం. రాష్ర్టాల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామ’ని చెప్పారు. ‘రకరకాల వ్యాక్సిన్లను పెద్దఎత్తున తయారుచేస్తూ, అందుబాటు ధరలోనే అందిస్తూ అంతర్జాతీయ కేంద్రంగా ఉన్న భారత్‌వైపు ప్రపంచం చూస్తున్నద’ని మోదీ తెలిపారు.   వందతులు రానివ్వొద్దు భారీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరిగేప్పుడు వదంతులు వ్యాప్తి చెందుతుంటాయని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమ సమాచారం ఎప్పటికప్పుడు తెలిసేలా కో-విన్‌ అనే సాఫ్ట్‌వేర్‌ను భారత్‌ రూపొందించిందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.