పవన్ రాకతో.. సంగీత్‌ సంబరాల్లో మెగా సందడి!

ఉద‌య్‌పూర్‌:  మెగా బ్రదర్ నటుడు నాగబాబు ముద్దుల తనయ నిహారిక మరికొన్ని గంటల్లో చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకోబోతుంది. నిహారిక-చైతన్యల పెళ్లి వేడుకలు ఉదయ్‌పూర్‌లోని ఉదరు విలాస్‌లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు రాత్రి 7.15 గంటలకు జరగనుంది. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులూ ఉదయ్‌పూర్‌ చేరుకొని పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. నిహారిక పెళ్లి వేడుకలకు పవన్‌ కళ్యాణ్‌ కూడా ఉదయ్‌పూర్‌ నిన్న రాత్రి చేరుకున్నారు. దీంతో తమ్ముడు వచ్చాడని చెబుతూ.. నాగబాబు ఓ ఫొటో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. నిహారిక పెళ్లి వేడుకల్లో మెగా, అల్లు ఫ్యామిలీలు ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. గత రాత్రి నిహారిక మెహందీ ఫంక్షన్‌లో హడావుడి చేశారు. అందరూ కలిసి దిగిన గ్రూప్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇరు కుటుంబాలు సోమవారమే ప్రైవేట్‌ విమానంలో ఉదరుపూర్‌ చేరుకున్నారు. సోమవారం రాత్రి సంగీత్‌, మంగళవారం సాయంత్రం మెహందీ వేడక నిర్వహించారు.

 

 

Leave A Reply

Your email address will not be published.