టీమిండియాకు గుడ్న్యూస్..
ఫిట్నెస్ పరీక్ష పాసైన రోహిత్ శర్మ

బెంగళూరు: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్నెస్ టెస్ట్ పాసయ్యాడు. ఐపీఎల్ 13వ సీజన్లో `తొడ కండరాల గాయంతో` ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్కు రోహిత్ దూరమైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనకు అనుమతించడానికి బెంగుళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఫిట్నెస్ టెస్ట్ పాసవడంతో ఈ నెల 14న అతడు ఆస్ట్రేలియా విమానం ఎక్కనున్నాడు.