సుప్రీంలో ఏపీ ప్రభుత్వానికి ఊరట..
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ జరిగిందా? లేదా? అనే అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అనేది తేలుస్తామని అక్టోబర్ 1న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సీజే జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై యథాతథ స్థితి కొనసాగించాలని సూచించింది. తదుపరి విచారణను శీతాకాల సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.
ఏపీలో పోలీసుల చట్ట ఉల్లంఘనపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లు, రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెదేపా మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ వేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.