హైద‌రాబాద్‌కు మ‌రో భారీ పెట్టుబ‌డి

హైద‌రాబాద్ : భాగ్య‌న‌గ‌రానికి మ‌రో భారీ పెట్టుబ‌డి రానుంద‌ని తెలంగాణ ఐటి, పుర‌పాల‌క మంత్రి కెటిఆర్ తెలిపారు. ఒప్పో 5 జీ ఇన్నోవేష‌న్ ల్యాబ్ ఏర్పాటు చేయ‌నుంద‌ని ట్విట్ట‌ర్ ద్వారా మంత్రి వెల్ల‌డించారు. ఇది దేశంలోనే మొద‌టి 5జీ ఇన్నోవేష‌న్ ల్యాబ్ అని పేర్కొన్నారు. పెట్టుబ‌డుల‌కు హైద‌రాబాద్ సానుకూల‌మ‌ని మ‌రోసారి నిరూపిత‌మైంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

కాగా ‌తెలంగాణ‌కు పెట్టుబ‌డుల ప్ర‌వాహం కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, ఆపిల్ వంటి సంస్థల‌తో పాటు ఫియ‌ట్ క్రిస్ల‌ర్ సంస్థ కూడా పెట్టుబ‌డులు పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

 

Leave A Reply

Your email address will not be published.