పెళ్లిచేసుకున్న టీమిండియా స్పిన్నర్ చాహల్

ముంబయి: టీమిండియా లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్నర్ చాహల్ ఓ ఇంటివాడయ్యాడు. ఈ ఏడాది ఆగస్టులో ధన్యశ్రీ వర్మతో నిశ్చితార్థం చేసుకున్న చాహల్ ఆమెని పెళ్లి చేసుకున్నట్లు మంగళవారం సోషల్ మీడియాలో ప్రకటించాడు. నిశ్చితార్థం అనంతరం ఐపీఎల్ -2020 సీజన్‌లో ఆడేందుకు చాహల్ యూఏఈకి వెళ్లాడు. ధనుశ్రీ కూడా టోర్నీ మధ్యలో యూఏఈకి వెళ్లడంతో పెళ్లికి ముందు ఇద్దరు కలిసి తిరిగేందుకు అవకాశం దక్కింది. అట్నుంచి ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడేందుకు వెళ్లి చాహల్ ఇటీవలే భారత్‌కు తిరిగొచ్చాడు. ఇక ముంబయిలో జన్మించిన ధన్యశ్రీ వర్మ మంచి డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. అంతేకాకుండా తాను ఓ యూట్యూబ్ ఛానల్‌ని సైతం నడుపుతోంది. ఆమె తండ్రి సాగర్ వర్మ వ్యాపార వేత్త. తల్లి వర్ష డెంటిస్ట్. దీంతో తొలుత డాక్టర్ కావాలని ఆశపడిన ధన్యశ్రీ.. ఆ తర్వాత డ్యాన్స్‌ని కెరీర్‌గా ఎంచుకుంది.
22.12.20 💍
We started at “Once Upon A Time” and found “Our Happily Ever After,” coz’ finally, #DhanaSaidYuz for infinity & beyond! pic.twitter.com/h7k3G3QrYx
— Yuzvendra Chahal (@yuzi_chahal) December 22, 2020