పంజాబ్ సిఎం భ‌గ‌వంత్ మాన్ ఇంటి స‌మీపంలో బాంబు క‌ల‌క‌లం

చండ‌గ‌ఢ్ (CLiC2NEWS): పంజాబ్ సిఎం భ‌గ‌వంత్ మాన్ నివాసం వ‌ద్ద బాంబు క‌ల‌క‌లం రేపుతోంది. చండీగ‌ఢ్‌లోని ముఖ్య‌మంత్రి నివాసం స‌మీపంలో భారీ పెలుడు ప‌దార్థాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో రాష్ట్ర పోలీసులు ఒక్క‌సారిగా అప్ర‌మ‌త్తం అయ్యారు.
ఈ సాయంత్రం 4 నుంచి 4.30 గంట‌ల స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి ఇంటికి స‌మీపంలోని హెలిప్యాడ్‌కు కొద్ది దూరంలోని ఓ మామిడి తోట‌లోట్యూబ్‌వెల్ ఆప‌రేట‌ర్ ఈ బాంబును గుర్తించారు.
కాగా ఈ ఘ‌ట‌న‌పై ర‌క్ష‌ణ బ‌ల‌గాలు ద‌ర్యాప్తు చేస్తాయ‌ని చండీగ‌ఢ్ అధికారులు వెల్ల‌డించారు.

ఈ ఘ‌ట‌న‌పై చండీగ‌ఢ్ అడ్మినిస్ట్రేష‌న్ నోడ‌ల్ అధికారి కుల్దీప్ కోహ్లీ మాట్లాడారు.. “ ప‌క్కా సమాచారం మేర‌కు బాంబు స్క్వాడ్ బృందం రంగంలోకి దిగి దాన్ని సీజ్ చేసింది.. అస‌లు ఆ పేలు ప‌దార్థం ఇక్క‌డకు ఎలా వ‌చ్చింది.. ఎవ‌రు తెచ్చారు అనే వివ‌రాలు తెలుసుకొనేందుకు య‌త్నిస్తున్నాం“ అని అధికారి తెలిపారు.

1 Comment
  1. binance not working says

    Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.

Leave A Reply

Your email address will not be published.