ఇంధన ట్యాంకర్‌ను ఢీకొన్న బస్సు.. 18 మంది మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/bus-accident-in-pakistan-18-members-dead.jpg)
ఇస్లామాబాద్ (CLiC2NEWS): పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కరచీ నుండి ఇస్లామాబాద్‌కు వెళుతున్న బస్సు ఇంధన ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో ట్యాంక్ పేలి ఘోర ప్రమాదం జరిగింది. మంటలు వేగంగా బస్సులోకి వ్యాపించడంతో 18 ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగాగాయపడ్డారు. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. కొందరు బస్సు కిటికీల నుండి బయటకు దూకి ప్రాణాలు రక్షించుకొన్నారు.