హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో లోయ‌లోప‌డిన బ‌స్సు.. 16 మంది దుర్మ‌ర‌ణం

సిమ్లా (CLiC2NEWS): హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. స్థానిక కుల్లు జిల్లాలో ఒక ప్రైవేటు బ‌స్సు లోయ‌లో ప‌డి 16 మంది ప్ర‌యాణికులు దుర్మ‌ర‌ణం చెందారు. మృతుల్లో బ‌డికి వెళ్లే చిన్న పిల్ల‌లు కూడా ఉన్నారు. జంగ్లా గ్రామ స‌మీపంలో ఇవాళ ఉద‌యం 8 గంట‌ల ప్రాంతంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. విష‌యం తెలుసుకున్న పోలీసులు, రెస్య్కూ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు 16 మృత‌దేహాలు వెలికి తీశారు. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 45 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశ ముంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.