పాక్‌లో లోయలో పడిన బస్సు: 19 మంది మృతి
కరాచీ (CLiC2NEWS): పాకిస్థాన్‌లో ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇస్లామాబాద్ నుంచి క్వెట్టాకు దాదాపు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతిచెందారు.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బలూచిస్థాన్‌లోని క్వెట్టా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
మలుపు వద్ద నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమదాం జరిగిందని అసిస్టెంట్ కమీషనర్ సయ్యద్ మెహ్తబ్ షా తెలిపారు.