పులివెందుల సమీపంలో లోయలో పడిన బస్సు.. 25 మందికి గాయాలు

పులివెందుల (CLiC2NEWS): పులివెందుల సమీపంలో ఆర్‌టిసి బస్సు 30 అడుగుల లోతులో పడింది. వైఎస్ ఆర్ జిల్లా పులివెందుల సమీపంలోని డంపింగ్ యార్డు ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో లోయలో పడిపోయింది. కదిరి నుండి పులివెందులకు బస్సు వస్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 25 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని టిడిపి ఎమ్మెల్సి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.