ఆన్‌లైన్ జూదం.. ఏకంగా రూ.58 కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త!
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/Rs.58-crores-lost-by-online-gabling.jpg)
నాగ్‌పుర్ (CLiC2NEWS): ఆన్‌లైన్ జూదంతో డబ్బును సులువుగా సంపాదించవచ్చని ఓ వ్యాపారవేత్త ఏకంగా రూ. 58 కోట్ల పోగొట్టుకున్నాడు. ఈ ఘటన నాగ్‌పుర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యాపారవేత్తను బుకి అనంత్ అలియాస్ సొంతు నవరతన్‌జైన్ డబ్చును సంపాదించడానికి సులువైన మార్గం అని.. వ్యాపారికి వాట్సాప్ లింకును పంపాడు. వ్యాపారితో ఆన్‌లైన్ జూదానికి ఖాతా తెరిపించాడు. ముందుగా వ్యాపారికి రూ. 5 కోట్లు గెలవడంతో బుకీని పూర్తిగా నమ్మాడు. అనంతరంగా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ. 58 కోట్లు పోగొట్టుకున్నాడు. తాను మోసపోయినట్లు గ్రహించిన వ్యాపారి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నవరతన్ జైన్ ఇంటిపై దాడి చేయగా.. రూ. 17 కోట్ల నగదు, 14 కిలోల బంగారం లభ్యమయ్యాయి. కాగా.. నిందితుడు ముందురోజే దుబాయ్‌కు పారిపోయినట్లుగా పోలీసలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.