ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు యుకవకులు మృతి

హైదరాబాద్(CLiC2NEWS): మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. బౌరంపేట కోకా కోలా కంపెనీ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ముగ్గురు ఘటనా స్థలంలో మృతిచెందారు. ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. అతనిని సూరారంలోని ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. వీరంతా ఎపి లోని ఏలురు, విజయవాడకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరు నిజాంపేట్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.