మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2023/05/accidnet-in-medak-dt.jpg)
మెదక్ (CLiC2NEWS): జిల్లాలోని నార్సింగి మండలం వల్లూరు అటవీ ప్రాంతంలో కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆటోలో ఆలూరుకు చెందిన ఆరుగురు వ్యక్తులున్నారు. వీరంతా గజ్వేల్‌కు ఆటోలో ప్రాయణిస్తుండగా వెనుకనుండి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.