కాలువలోకి దూసుకెళ్లిన కారు..

తూర్పుగోదావరి (CLiC2NEWS): తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు సమీపంలో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఆదివారం జ‌రిగిన ఈ ప్రమాదం లో కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే తేరుకుని బయటకు వచ్చేశారు.
ప్రయాణికులకు స్వల్పగాయాలు అయ్యాయి. కాలువలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు తెలిపారు. వెంట‌నే స్పందించిన స్థానికులు గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.