వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు
కారులో ఉన్న ఇద్దరుతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న గజ ఈతగాడు మృతి

సిద్ధిపేట (CLiC2NEWS) : జిల్లాలోని దుబ్బాక మండలంలో వ్యవసాయం బావిలోకి కారు దూసుకుపోయింది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి చిట్టాపూర్ వద్ద రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయింది. బావిలోతు సుమారు 15 నుండి 20 గజాలుంటుందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కారును వెలితీసేందుకు చర్యలు చేపట్టారు.
కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు, బావిలో నుండి కారును బయటకు తీసేందుకు సహాయక చర్యల్లో పాల్గొన్న గజ ఈతగాడు మృతిచెందారు. దాదాపు 6 గంటల పాటు శ్రమించి కారును బావి ఉండి వెలికితీసేందుకు ప్రయత్నించారు. బావిలోని నీటిని రెండు మోటార్ల సాయంతో ఖాళీ చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలు పరిశీలించారు.