అతివేగంతో మహిళను ఢీకొట్టిన కారు!.. మహిళ మృతి

కాజీపేట్ (CLiC2NEWS): కాజీపేట ఫాతిమానగర్‌లో అతివేగంతో వచ్చిన కారు ఓ మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హనుమకొండ జిల్లాలోని దర్గా కాజీపేటకు చెందిన నర్సు గాదె కవిత మృతి చెందింది. భార్యాభర్తలు ఓటువేసి తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయం కావడంతో ఎంజిఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. ఎక్సైజ్ సిఐ కుమారుడు అతివేగంతో కారు నడిపి ప్రమాదానికి కారణమైనట్లు సమాచారం. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తురాలు తరపు బంధువులు శుక్రవారం కాజీపేట వంతెన వద్ద రాస్తారోకో చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.