Eluru: వరద నీటిలో ఐదుగురుతో సహా కొట్టుకుపోయిన కారు..
ఏలూరు (CLiC2NEWS): జిల్లాలో కురిసిన వర్షాలకు వరద నీటితో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వేలేరుపాటు మండలంలో ఐదురుగు ప్రయాణికులు ఉన్న ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. కారులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కారులో ఉన్న వారు తమను రక్షించమని హాహాకారాలు చేసినట్లు స్థానికులు తెలుపుతున్నారు. వాగులో కొంత దూరం వెళ్లిన తర్వాత కారునుండి బయటకు వచ్చిన వారు వాగులోని పొదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక బృందాలు వచ్చినా వాగు భారీగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది.
వేలేరుపాడు ఘటన గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయక బృందాలను తక్షణమే తరలించాలని, అవసరమైతే హెలికాప్టర్ తెప్పించి ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించాలని ఆదేశించారు.