లిప్టులో చిక్కుకుపోయిన చిన్నారి ..

ల‌ఖ్‌న‌వూ (CLiC2NEWS): ఓ చిన్నారి అపార్ట్‌మెంట్‌లో ఉన్న లిప్టులో ఇరుక్కుపోయి న‌ర‌క‌యాత‌న అనుభ‌వించిన ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ చోటుచేసుకుంది. ల‌ఖ్‌న‌వూలోని జానేశ్వ‌ర్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న లిప్టులో ఓబాలిక బుధ‌వారం లిప్టులో ఎక్కిన అనంత‌రం మ‌ధ్య‌లో లిప్టు ఆగిపోయింది. బాలిక తీవ్ర‌మైన భ‌య‌బ్రాంతుల‌కు లోనై కేక‌లు వేసింది. అనంత‌రం ధైర్యం తెచ్చుకొని లిప్టు త‌లుపులు తెర‌వ‌డానికి సాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నించింది. త‌న‌ను ఎవ‌రైనా కాపాడాల‌ని కెమెరావైపు చూస్తూ ప్రాధేయ‌ప‌డుతున్న దృశ్యాలు సిసిటివి పుటేజిలలో క‌నిపిస్తున్నాయి. దాదాపు 20 నిమిషాలు ఆ చిన్నారి న‌ర‌క‌యాత‌న అనుభ‌వించింది. త‌ర్వాత బాలిక‌ను లిప్ట్‌నుండి సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చిన‌ట్లు స‌మాచారం. ఈ దృశ్యాలు సామ‌జిక మాధ్య‌మాల‌లో వైర‌ల్‌గా మారింది.

Leave A Reply

Your email address will not be published.