హైదరాబాద్‌లో దారుణం..
ముగ్గురు పిల్లలను చంపి ఉరేసుకున్న తండ్రి

హైదరాబాద్ (CLiC2NEWS): ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలను చంపి తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టంగుటూరుకు చెందిన రవి మని స్కీమ్ పేరుతో చుట్టుప్రక్కల గ్రామాల్లోని వారితో డబ్బులు కట్టించేవాడు. ఈ స్కీమ్ ద్వారా రూ. వెయ్యికి రూ. 3 వేలు.. 58 రోజులకు రూ. లక్షకు రూ. 5 లక్షలు ఇప్పిస్తానంటూ డబ్బులు కట్టించాడు. నెలలు గడిచినా డబ్బులు ఇవ్వకపోవడంతో.. తమ డబ్బులు ఇవ్వాలంటూ ఒక్కొక్కరుగా ఇంటికి వచ్చి మరీ అడుతగుతున్నారు. దీంతో ఏంచేయాలో తోచని పరిస్థితిలో ముగ్గరు పిల్లలను చంపేసి తానూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.