bhadradri kothagudem: రోడ్డుప్రమాదంలో తండ్రి, ఇద్దరు పిల్లలు మృతి
మణుగూరు (CLiC2NEWS): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం భద్రాద్రి పవర్ ప్లాంట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో వేగంగా వచ్చిన వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కరకగూడెం మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన అంబోజు కృష్ణ (32), ఆయన కుమార్తె జాహ్నవి (10), కుమారుడు ప్రీతం (7) మోటార్ బైక్‌పై వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన వాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే కృష్ణ, ప్రీతం ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా జాహ్నవిని దవాఖానాకు తరలిస్తుండగా మృతి చెందింది.