మలక్‌పేటలోని ఓ హోటల్‌లో అగ్నిప్రమాదం: ఒకరి మృతి

హైదరాబాద్ (CLiC2NEWS): మలక్‌పేటలోని ఓ హోటల్‌లో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. సోహెల్ హోటల్‌లోని కిచెన్‌లో మంటలు చెలరేగి, దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులు, మిగతావారు భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. లోపల దట్టమైన పొగలు వ్యాపించడంతో హోటల్ లో పనిచేసే కార్మికుడు మృతి చెందినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారుల ఆరాతీస్తున్నారు. విద్యుత్ షార్డ్‌సర్క్యూట్ వలన ప్రమాదం జరిగిందా.. లేదా గ్యాస్ లీకేజీ వలన ప్రమాదం సంభవించిందా అని దర్యాప్తు చేస్తున్నారు.