భారత్‌లో నాలుగో ఒమిక్రాన్ కేసు నమోదు

ముంబయి (CLiC2NEWS): దక్షిణాఫ్రికా నుండి ముంబయికి వచ్చిన 33 సంవత్సరాల వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించారు. అతడు ఇప్పటి వరకూ ఒకసారి కూడా వ్యాక్సిన్ వేయించుకోలేదు. నవంబరు 24 వతేదీన దేశ ఆర్థిక రాజదాని అయిన ముంబయికి చేరుకున్న తర్వాత అతడికి జ్వరం వచ్చింది. దీంతో కొవిడ్ నిర్థారణ పరీక్ష చేయగా..ఒమిక్రాన్ బారిన పడినట్లు తాజాగా గుర్తించారు.
శనివారం గుజరాత్‌లో మరో వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. అతడు ఇటీవల జింబాబ్వే నుండి గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు నమోదైన రెండు కేసులతో కలిపి మొత్తం నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.