కిడ్నాపర్ల చెర నుండి చాకచక్యంగా తప్పించుకున్న బాలిక

గుంటూరు (CLiC2NEWS): దుండగుల బారి నుండి ఓ బాలిక చాకచక్యంగా తప్పించుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లా లోని వెంగళరావునగర్‌లో చోటుచేసుకుంది. బాలిక తల్లికి రోడ్డు ప్రమాదం జరిగిందని దుండగులు బాలికను కారులో వెక్కించుకుని వెళ్లారు. విజయవాడ బస్టాండ్ వద్ద దుండగులు కారు ఆపి.. ముఠా సభ్యులు భోజనానికి వెళ్లారు. ఈ సమయంలో కారు డోర్ లాక్ పడకపోవడంతో బాలిక తప్పించుకుంది. ఆ బాలిక బస్టాండ్‌లోని కంట్రోల్ రూమ్ సిబ్బందికి విషయాన్ని తెలిపింది. ఆర్‌టిసి సిబ్బంది సహాయంతో కిడ్నాపర్ల నుండి బాలిక తప్పించుకుంది. విషయం తెలుసుకున్న దుండగులు కారును అక్కడే వదిలి పరారయ్యారు. ఆర్‌టిసి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలికను అపహరించడానికి కిడ్నాపర్లు వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.