తెలుగు గంగ జలాశయంలోకి దూకిన ఆవుల మంద.. 50 గల్లంతు
నంద్యాల (CLiC2NEWS): నంద్యాల జిల్లా వెలుగోడు వద్ద అడవి పండుదలను చూసి బెదరిపోయిన ఆవులమంద తెలుగు గంగ జలాశయంలోకి దూకింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో 400 గోవులను మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనలో మరో 50 ఆవులు గల్లంతయ్యాయి. వెలుగోడుకు చెందిన మల్లయ్య, శంకర్, వెంకటరమణ, కూర్మయ్య, పెద్దస్వామి, బాలలింగం, ఈశ్వర్, బూరుగయ్య, సాంబకోటి ఆవులను మేపుతూ జీవనం సాగిస్తున్నారు. తెలుగు గంగ జలాశయం పక్కన గల మైదానంలో ఆవుల మందను నిలిపి ఉంచారు. అటు వైపుగా పరుగులు తీస్తూ అడవి పందుల మంద పరుగులు తీస్తూ రావడంతో అవుల బెదరిపోయాయి. ఈ క్రమంలో దాదాపు 450 గోవులు జలాశయంలోకి దూకేశాయి. మరో 50 వరకు ఆవులు అడవిలోకి పరుగుతు తీశాయి. ఈ క్రమంలో ఈతగాళ్లు, మత్స్యకారులు నాటు పడవులు, పెట్టెలపై జలాశయంలోకి ఒడ్డకు తోలుకువచ్చారు.