నగరంలోని గుడిమల్కాపుర్‌లోని ఓ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం..
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని గుడిమల్కాపుర్‌లోని అంకుర ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం ఆస్పత్రి భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. ఆరు అంతస్థుల ఆస్పత్రి భవనం అంతా మంటలు అలుముకున్నాయి. ముందుగా ఆరో అంస్థులో చెలరేగిన మంటలు మొదటి అంతస్తు వరకు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆస్పత్రిలోని సిబ్బంది, రోగులను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 4 అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.