షాద్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి
రంగారెడ్డి (CLiC2NEWS): జిల్లాలోని షాద్‌నగర్‌లోని స్థానిక సౌత్ గ్లాసు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గాజు పరిశ్రమలో కంప్రెషనర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారు ఒడిశా, బిమార్, యుపి వాసులుగా గుర్తించారు. క్షత గాత్రులను ఉస్మానియా, గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.