దేవుడు చెప్పాడంటూ.. మహిళ ఆత్మహత్యాయత్నం!
![](https://clic2news.com/wp-content/uploads/2021/03/fire-sucide-lady.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో రాజేంద్రనగర్ ప్రాంతంలో ఓ మహిళ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిథిలోని అత్తాపూర్లో ఓ మహిళ రోడ్డుపైకొచ్చి దేవుడు చెప్పాడంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను పోలీసులు అంబులెన్సులో ఎక్కించి ఉస్మానియాకు తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసలు తెలిపారు.