నిజామాబాద్ జిల్లాలో రెండు తలలతో పుట్టిన గొర్రె పిల్ల
నిజామాబాద్ (CLiC2NEWS): నిజామాబాద్ జిల్లాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో ఓ గొర్రె రెండు తలల పిల్లకు జన్మనిచ్చింది. జక్రాన్‌పల్లికి చెందిన తొగరి లక్ష్మణ్‌కు చెందిన గొర్రెల మందలోని ఓ గొర్రె ప్రసవించింది. అయితే ఆ గొర్రెకు పుట్టిన పిల్ల రెండు తలలతో జన్మించింది. ఈ విషయం అందరూ చర్చించుకోవడంతో ఆ వింతగా జన్మించిన గొర్రె పిల్లను చూసేందుకు భారీగా జక్రాన్‌పల్లికి జనాలు తరలివస్తున్నారు. కాగా జన్యు లోపంతోనే ఈ రకంగా జన్మించి ఉండొచ్చని పశు వైద్య అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.