అనకాపల్లిలో బస్సును ఢీకొన్న లారీ ..ఐదుగురు పరిస్థితి విషమం
![](https://clic2news.com/wp-content/uploads/2023/02/bus-accident-in-anakapalli-dist.jpg)
ధర్మవరం (CLiC2NEWS): అనకాపల్లి జిల్లాలో ఆర్‌టిసి బస్సు ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న బస్సును లారీ వెనుకనుండి ఢీకొట్టింది. బస్సు అదుపు తప్పి ముందున్న ఆటోను ఢీకొట్టి పంటకాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అనకాపల్లి అనకాపల్లి నుండి బయలు దేరిన బస్సు ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై 50 మంది ప్రయాణికులతో ఉన్న బస్సు ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగింది. ఆసమయంలో వెనుకనుండి వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. క్షతగాత్రులను ఆస్సత్రికి తరలించారు. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. గాయపడిన వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని విశాఖ కెజిహెచ్‌కు తరలించారు.