టిబెట్‌లో భారీ భూకంపం కారణంగా 120 మంది మృతి
లాసా (CLiC2NEWS): నేపాల్ -టిబెట్ సరిహద్దు ప్రాంతంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. సరిహద్దు ప్రాంతానికి 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచె ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. టిబెట్లోని షిజాంగ్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పూ 6.8గా నంమోదైంది. భూకంపం కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 120 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టిబెట్‌లో సంభవించిన భూకంపం కారణంగా కొన్ని క్షణాల పాటు తీవ్రస్థాయిలో భూమి కంపించింది. అనే భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. ఈ భూకంపం అనంతరం టిబెట్ రీజియన్‌లో మరో రెండు సార్లు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రకంపనల తీవ్రత వరుసగా.. 4.7, 4.9గా నమోదైనట్లు తెలిపారు. ఈ భూకంప ప్రభావం భారత్‌లో కూడా కనిపించింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్, పశ్చిమ బెంగాల్, బిహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. భారత్‌తో పాటు చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌లో కూడా ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది.