కాటేసిన పాముతో ఆస్పత్రికి..
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/HOSPITAL-IMAGE.jpg)
లఖ్‌నవూ (CLiC2NEWS): ఓ మహిళను పాము కాటు వేసింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త.. నేరుగా ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటికి వచ్చి పామును సంచిలో వేసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో చోటుచేసుకుంది. నరేంద్ర భార్యను పాటు కాటువేయగా స్థానికులు వైద్యం అందించేందుకు ఆమెను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అతను తన భార్యను కాటు వేసిన పామును సంచిలో వేసుకుని భార్య ఉన్న ఆస్పత్రికి వెళ్లాడు. ఇది చూసిన వైద్యులు ఎందుకు తీసుకొచ్చావ్ అని ప్రశ్నించగా.. ఏ పాము కాటు వేసిందో తెలిస్తే దానికి తగ్గట్టు మందు వేయడానికి వీలుంటుందని సమాధానమిచ్చాడు. దీంతో వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. నరేంద్ర భార్య ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపినట్లు సమాచారం.